చోడవరం మండలం జన్నవరం గ్రామంలో విశాఖ డైరీ నుండి రావలసిన సంక్రాంతి బోనస్ చెల్లించలేదని జన్నవరం పాల సంఘం నేతలపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని పాల కేంద్రం వద్ద నిరసన తెలిపారు. నిరసన తెలిపిన వారిలో లెగిసెట్టి శ్రీనివాసరావు సాలాపు పాపారావు, ఎస్ వి రమణ ఎస్ సత్తిబాబుతో పాటు మరికొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము 35 ఏళ్లగా విశాఖ డైరీకి పాలు సరఫరా చేస్తున్నామన్నారు.