నర్సీపట్నం మండలం నీలం పేట గ్రామానికి చెందిన వృద్ధుడు పెట్ల నూకయ్య నాయుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ ఎస్సై రాజారావు తెలిపారు. ఆయన గత కొద్దికాలంగా డయాబెటిస్ తదితర అనారోగ్యంతో బాధపడుతున్నాడు అన్నారు. దీంతో జీవితం మీద విరక్తి చెంది పురుగుల మందు తాగినట్లు తెలిపారు వైజాగ్ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడని పేర్కొన్నారు.