నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయం ఆవరణ వర్షం పడితే చిత్తడిగా తయారవుతుంది. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో కార్యాలయం ఆవరణ మొత్తం బురదమయంగా తయారవడంతో సందర్శకులు ఇబ్బంది పడ్డారు. మున్సిపాలిటీ అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కనీసం కార్యాలయం ఆవరణను శుభ్రం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.