నర్సీపట్నంలో వేంచేసియున్న నూకాంబిక అమ్మవారికి సీఎంఆర్ అధినేత వెంకటరమణ ఇచ్చిన రూ. 10 లక్షలు ఏమయ్యాయో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ కు స్వయంగా చెక్కు అందజేశారని పేర్కొన్నారు. ఆ మొత్తం అమ్మవారి బ్యాంకు ఖాతాకు జమ కాలేదని తెలిపారు. కావాలంటే దేవాలయ శాఖ అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.