కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు బుధవారం డీల్లీలో కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా నగరంలో దాదాపు 20వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని, రాష్ట్రంలో ఇది అతిపెద్ద ప్రభుత్వ రంగ పారిశ్రామిక యూనిట్ అని ఆయనకు వివరించారు.