విద్యార్థులు ఇప్పటి నుంచే బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సూచించారు. కొయ్యూరు గురుకుల పాఠశాలను శనివారం సందర్శించి, అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. బాగా చదువుకుని తల్లిదండ్రులు, గ్రామానికి పేరు తేవాలన్నారు. ఖైనీ, గుట్కా తదితర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఎంపీపీ బడుగు రమేష్ పాల్గొన్నారు.