అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పేరుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన మోసగాళ్లు ఒక ఫేక్ ఖాతాను సృష్టించినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం తెలిపారు. +9779748339144 అనే నెంబర్ తో ఖాతా పూర్తిగా మోసపూరితమైనదన్నారు. ఆ నంబర్ ద్వారా డబ్బులు అడగటం లాంటి మోసపూరక చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. ఎవరికి ఎటువంటి నగదు బదిలీ చేయోద్దని సూచించారు. ఆ నంబర్ నుంచి వచ్చిన కాల్ కు ఎవరూ స్పందించవద్దని తెలిపారు.