అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలంలోని రేవుపోలవరం సముద్రంలో మునిగి గురువారం ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇద్దరిలో ఒకరి మృతదేహo రేవుపోలవరం తీరం వద్ద ఒడ్డుకు చేరుకోగా మరొక మృత దేహం నక్కపల్లి మండలం తీనార్ల తీరం వద్ద ఒడ్డుకు చేరింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద సంఘటనపై ఎస్. రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.