విశాఖలోని ఆరిలోవలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కన్నకూతురిపై లైంగిక దాడికిపాల్పడ్డాడు ఓ మృగాడు. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి భార్య, ముగ్గురు పిల్లలతో ఆరిలోవ ఉంటున్నాడు. పెద్ద కుమార్తె స్కూల్ లో పలుమార్లు కళ్లు తిరిగి పడిపోవడంతో ఉపాధ్యాయులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయట పడింది. దీంతో బాలిక తల్లికి తెలియజేయగా పోలీసులను ఆశ్రయించింది.