విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోగలచిన్నముసిడివాడ స్వధార్ హోమ్ నుంచి మహిళ పరారీ అయింది. ఈ మేరకు బుధవారం పెందుర్తి పోలీసులకు స్వధార్ హోం ఇన్చార్జి లింగమ్మ ఫిర్యాదు చేశారు. పరారైన మహిళ పశ్చిమబెంగాల్ చెందిన వారిగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్ వద్ద సీసీ టీవీ పుటేజ్లను పరిశీలించారు.