యలమంచిలి పట్టణం ధర్మవరంలో వెలసిన కనకమాలక్ష్మి అమ్మవారిని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయంలో ఎమ్మెల్యే విశేష పూజలు అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి తీర్థ మహోత్సవాలు సందర్భంగా దర్శించుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.