ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద గోదావరికి వరద పెరుగుతూ వస్తోంది. గురువారం వరకు సుమారు 8 అడుగుల మేర నీటిమట్టం పెరగడంతో లంక రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో లంకల్లో పండించే కూరగాయలను బయటకు తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. వరద పెరిగితే పాడి పశువులకు గ్రాసం ఇబ్బందులు తప్పేలా లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.