పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠా గోదావరికి బుధవారం ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. పరీవాహక ప్రాంతాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన మత్స్యకారులు బుధవారం గోదావరిలో కట్టిన వలకట్లను తొలగించుకున్నారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉండడంతో ఆధికారులు కూడా అప్రమత్తమయ్యారు.