కేంద్రమంత్రి కుమారస్వామిని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, నరసాపురం ఎంపీ కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కుమార్ స్వామిని సాలువతో ఘనంగా సత్కరించి శ్రీవారి విగ్రహాన్ని బహుకరించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఇరువురు కాసేపు చర్చించారు.