పెనుగొండ: వైభవంగా నడిపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం

53చూసినవారు
పెనుగొండ: వైభవంగా నడిపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం
పెనుగొండ మండలం నడిపూడి గ్రామంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెనుగొండ పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శనివారం జరగనున్న శ్రీ స్వామివారి తిరునాళ్ల సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్