పెనుమంట్ర: ప్రమాదవశాత్తు ధాన్యం ట్రాక్టర్ బోల్తా

60చూసినవారు
పెనుమంట్ర: ప్రమాదవశాత్తు ధాన్యం ట్రాక్టర్ బోల్తా
పెనుమంట్ర నుంచి జుత్తిగ గ్రామానికి వెళ్తున్న రహదారిలో మంగళవారం ఉదయం ధాన్యం బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. రోడ్డు గోతులతో నిండిపోవడం వల్లే ప్రమాదం ఏర్పడిందని, ఈ రహదారి మరమ్మతులు కోసం ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్