పోడూరు మండలం వేడంగి గ్రామానికి చెందిన చెల్లిబోయిన సింహాద్రి(35) అనే వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. వృత్తి రిత్యా కొబ్బరికాయలు కోసే పని చేసే ఇతను బుధవారం వ్యక్తిగత కారణాలతో పురుగు మందు తాగడు. ఇది గమనించిన కుటుంబీకులు తొలుత పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరుకు తరలించగా అక్కడ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.