ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బుధవారం నిర్వహిస్తారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. త్యాగరాజ భవనంలో సాయంత్రం 4. 30 గంటలకు జరిగే సమావేశం తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. కావున కూటమి నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జులు, పట్టభద్రులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.