భీమవరం పురపాలక సంఘం ప్రజారోగ్య విభాగంలో పని చేస్తున్న 35 మంది క్లాప్ వెహికెల్స్పై క్లాప్ డ్రైవర్లకు జీతాలు ఇప్పించవలసిందిగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుకు భీమవరం మున్సిపల్ క్లాప్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు మంగళవారం వినతి పత్రాన్ని అందించారు. ఆగస్టు, సెప్టెంబరు, రెండు నెలల జీతాలు ఇవ్వలేదని, ఇప్పుడు మూడో నెల కూడా వస్తుందని, పెండింగులో ఉన్న మా జీతాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నామని అన్నారు.