చింతలపూడి నియోజకవర్గంలో జగన్ బర్త్ డే వేడుకలు

85చూసినవారు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాలలో నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్