ఏలూరు జిల్లా లింగపాలెం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుండి ఆయన వారి సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.