ఏలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం రాత్రి ముసునూరు గ్రామంలో అక్రమ మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులు ఏలూరు సీఐ ఫణి కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. స్థానిక మహిళలు అనగాని మహాలక్ష్మి, అనగాని పద్మ కుమారి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి దాడిలో 40 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.