ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావుని అమరావతి క్యాంపు కార్యాలయంలో శనివారం ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల బొకే అందించి శాలువాతో చిరు సన్మానాన్ని నిర్వహించారు. అనంతరం ఏలూరు నియోజకవర్గంలోని పలు శాంతిభద్రతల అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు.