ఫిర్యాదుల పరిష్కార వేదికకు సంబంధించి అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ప్రతీ అర్జీకి అర్థవంతమైన సమాదానం ఇస్తూ పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో ఆమె అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన పిజిఆర్ఎస్ లో 248 అర్జీలు వచ్చాయన్నారు.