ఏలూరు జిల్లాలో విశిష్ట సేవలు అందించిన ఆర్డీవోలు ఖాజావలి, భవాని శంకరి బదిలీపై ఇతర జిల్లాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం వారికి ఆత్మీయ వీడుకోలు పలికారు. అనంతరం వారిని శాలువా కప్పి, మెమెంటో అందించి సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. విజయవాడ వరదల బాధితులకు సహాయం అందించే సమయంలో ఆర్డీవోలు అంకిత భావంతో, సానుకూల దృక్పథంతో, చిత్తశుద్ధితో పనిచేశారన్నారు.