రానున్న ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం: బడేటి చంటి

66చూసినవారు
రానున్న ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం: బడేటి చంటి
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం ఖాయమని తెదేపా ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి అన్నారు. ఈ మేరకు బుధవారం ఏలూరులో 16వ డివిజన్ లో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల పేరిటప్రజలకు తక్కువ సొమ్ము ఇస్తూ పన్నులు, ఇతర రూపాల్లో పెద్ద మొత్తం దండుకుంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్