ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల నిర్వహణపై మంగళవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంక్రాంతికి నిర్వహించే కోడిపందేలపై ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయబద్ధంగా వస్తున్న పందేలను పూర్తిగా ఆపేయకుండా, కత్తులు కట్టకుండా నిర్వహిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు.