నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో 20 చౌక దుకాణాలకు 63 దరఖాస్తులు వచ్చాయని ఆర్డీఓ దాసిరాజు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 19న నరసాపురం పట్టణంలోని వైఎన్ కళాశాల ఎంసీఏ బ్లాక్‌లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12: 30 వరకు రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించారు.