మొగల్తూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో సిహెచ్ త్రిశూలపాని అధ్యక్షతన రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైనది. ఈ శిక్షణ కార్యక్రమం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల మీద ఏలూరులో శిక్షణ పొందిన అధికారులచే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ట్రైనీర్స్ క్రింద యు పి ఆర్ డి నవీన్ కిరణ్, మెడికల్ డిపార్ట్మెంట్ ఎం పి హెచ్ ఈ ఓ ఏ ఎస్ ఎన్. మూర్తి, ఐసిడి సూపర్వైజర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.