మొగల్తూరు ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశం సోమవారం ఎల్బీచర్లలో జరిగింది. ఈ సందర్భంగా వంకాయల రవికుమార్ అధ్యక్షుడిగా, బి. మురళి కార్యదర్శిగా, కె. రామారావు కోశాధికారిగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. సభ్యులు వారిని ఘనంగా అభినందించారు.