వసతి గృహాలలో మెరుగైన మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువులో మరింత రాణించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ వసతి గృహం మొత్తం కలియ తిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు.