ప్రజలందరూ కూడా ఎన్నికల నియమావళి పాటించాలి: ఎస్సై అప్పలరాజు

58చూసినవారు
ప్రజలందరూ కూడా ఎన్నికల నియమావళి పాటించాలి: ఎస్సై అప్పలరాజు
ప్రజలందరూ కూడా ఎన్నికల నియమావళి పాటించాలని, గొడవలకు దూరంగా ఉండాలని ఉండ్రాజవరం సబ్ ఇన్స్పెక్టర్ అప్పలరాజు అన్నారు. ఈ మేరకు ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చిలకంపాడు గ్రామంలో గ్రామస్తులతో ఎస్సై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా శాంతికి భంగము కలగకుండా, ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్