పాలకొల్లు పట్టణంలో ఆదివారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన 2కె రన్ సేవ్ గర్ల్ చైల్డ్ కార్యక్రమం విజయవంతం అయింది. ఈ సందర్భంగా స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో పలువురు ప్రముఖులు హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం రాష్ట్ర హోంమినిస్టర్ వంగలపూడి వనిత ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.