కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవ సేవా సమితి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బాలం రత్నాజీ సౌజన్యంతో తులాభార కార్యక్రమం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 80 కేజీల పట్టిక బెల్లంతో ఎమ్మెల్యేని తులాభారం చేయ్యడం జరిగింది.