వెంటపాడు మండలం ఆకుతీగపాడు సమీపంలో లబ్ధిదారులకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం, రూ. 5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని వ్యవసాయ కరణ సంఘం జిల్లా కార్యదర్శి కలింగ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సచివాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు అన్యాయం జరిగిందన్నారు.