పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

50చూసినవారు
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని దండగర్ర సర్పంచ్ పిల్లా రాంబాబు అన్నారు. పర్యావరణ మాసోత్సవాల్లో భాగంగా సోమవారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం దండగర్ర శివారు లింగారాయుడి గూడెంలో మొక్కలు నాటారు.సకాలంలో వర్షాలు పడాలంటే మొక్కలు ప్రధానమన్నారు. మొక్కలు నాటడం ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు.తద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. ఉపసర్పంచ్ కె. రాంబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్