ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్గా మంతెన రామరాజు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ, పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.