ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం నుంచి కృష్ణా జిల్లా కేసరపల్లి వద్ద ఆదివారం జరగనున్న హైందవ శంకరావం సభకు దుర్గామాత గురు భవాని, దుర్గారావు ఆధ్వర్యంలో హిందూ భక్తులు 100 మంది బయలుదేరి వెళ్లారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త దుర్గారావు మాట్లాడుతూ 5000 సంవత్సరం క్రితం నుంచి హైందవ మతం ఉందని ఈ మధ్యకాలంలో హిందువులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని అన్యమతస్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని ఖండించాలన్నారు.