ఉంగుటూరు: తాగు నీటి బోరుకి శంకుస్థాపన చేసిన ఎంపీపీ

63చూసినవారు
ఉంగుటూరు: తాగు నీటి బోరుకి శంకుస్థాపన చేసిన ఎంపీపీ
ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం కాలనీలో తాగునీటి బోరు మరమత్తుకు గురైంది. నాలుగు రోజులుగా వాటర్ ట్యాంక్ ద్వారా కాలనీ ప్రజలకు నీటిని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి మండల పరిషత్ నిధుల నుంచి కొత్త బోరు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. శుక్రవారం, ఎంపీపీ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విష్ణుమూర్తి, వార్డు సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్