ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చింతమనేని
పెదపాడు మండలం కొక్కెరపాడు, వెంపాడు, దాసరి గూడెం, కలపర్రు సహా పలు గ్రామాలలో శనివారం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించే ప్రజలను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి తమకు అండగా ఉండాలని ఆయన సూచించారు.