అక్టోబర్ 2న మాంసం, చేపలు అమ్మకాలు నిషేధం
నరసాపురం పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీన మాంసం, చేపలు అమ్మడం నిషేధమని మున్సిపల్ కమిషనర్ అంజయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించి మాంసం, చేపలు అమ్మినా, వధించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.