నరసాపురం: మానసిక ప్రశాంతతకు యోగ అభ్యాసం
మానసిక ప్రశాంతతకు యోగా అభ్యాసన ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం చిన్న అమిరం విశ్వకవి స్కూల్ వద్ద ఉన్న ధ్యాన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. దసరా మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యాన కేంద్రంలో యోగా అభ్యాసన చేశారు. భక్తులతో మాట్లాడుతూ యోగ అభ్యాసనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు.