డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి ఎమ్మెల్యే నామినేషన్
ఎన్డీయే కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉపసభాపతి స్థానానికి నామినేషన్ దాఖలు చేయటం సంతోషంగా ఉందని రఘురామ తెలిపారు. ఇతర ఏ నామినేషన్లు రాకపోతే తన ఎన్నిక ఏకగ్రీవం కానుందన్నారు. కాగా, ఆయనతో పాటు మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాసరావు తదితరులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.