చక్రాయపేట: గండిలో మంచుతో అందంగా కనిపించిన శేషాచల కొండలు

75చూసినవారు
కడప జిల్లా చక్రాయపేట మండలంలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంతో పాటు సమీపంలోని కొండలు శనివారం ఉదయం పొగ మంచు కమ్మేసింది. ఉదయం 9 గంటల వరకు మంచు విడవలేదు. అయితే ఈ దృశ్యాలను చూసి గండి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఊటీ కొండలను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే పొగ మంచు కారణంగా వాహనదారులు, చిరు వ్యాపారులు కొంత ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్