కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసు ఉన్నతాధికారులు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారన్న కేసులో పులివెందుల పోలీసులు ఆయనకు సోమవారం విచారణకు రావాలని నోటీసు అందజేశారు. ఈ క్రమంలో కడప సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు ఆయన విచారణ హాజరుకాగా పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, జిల్లా అదనపు ఎస్పీ ప్రకాశ్ బాబులు విచారిస్తున్నారు.