HSBC: కస్టమర్లకు BANK హెచ్చరిక
HSBC బ్యాంక్ తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. బ్యాంక్ పేరిట వస్తున్న నకిలీ కాల్స్, సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు కస్టమర్లకు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మొబైల్ నంబర్లు, వాట్సప్ ఛానళ్ల గురించి తెలియజేసింది. HSBC అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సీఈవో వేణుగోపాల్ మంఘాట్తో సంబంధం ఉన్నట్లు కొందరు తప్పుడు ధ్రువీకరణతో కస్టమర్లకు వలవేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.