దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నిత్యావసరాల ధరలు తెలంగాణలోనే అత్యధికం
తెలంగాణలో సగటు వ్యక్తి జీవనం రోజురోజుకూ మరింత భారంగా మారుతోంది. దేశంలోని ప్రధాన రాష్ట్రాలో పోలిస్తే మన రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగాయి. 2012-24 మధ్యకాలంలో CPI సగటు దేశవ్యాప్తంగా 100 నుంచి 193 పాయింట్లకు పెరగగా, తెలంగాణలో అది 201.6 పాయింట్ల మేర పెరిగింది. సారవంతమైన భూములు, సమృద్ధిగా వనరులు ఉన్న తెలంగాణ తొలి స్థానంలో ఉండటం నిత్యావసర ధరల పెరుగుదలకు అద్దం పడుతోందని వినియోగదారుల ధరల సూచిక(CPI)-2024 ఆగస్టు నివేదిక చెబుతోంది.