వినియోగదారులకు షాక్.. రూ. లక్ష దాటిన వెండి ధర
వెండి కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ఇటీవల వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు ధరలు భారీ నుంచి అతి భారీగా పెరిగాయి. నిన్నటి ధరలతో పోల్చుకుంటే వెండి ధరలు ఒక్క రోజులోనే రూ. 3000కు పెరిగి కిలో రూ. 1,01,000కి చేరుకుంది. 'ఆల్ టైమ్ హై'కి చేరడంతో వినియోగదారులు షాప్ వరకు వెళ్లి కొనకుండా వెనుదిరుగుతున్నారు.