3,445 పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 3,445 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దరఖాస్తులు కోరుతోంది. వీటిలో NTPC నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, జూ. క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. అక్టోబర్ 20 దరఖాస్తులకు చివరి తేదీ. వెబ్సైట్ https://www.rrbapply.gov.in/.