టెన్త్, ఐటీఐ అర్హతతో 5066 ఉద్యోగాలు
ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వెస్ట్రన్ రైల్వే 5,066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికయిన వారికి దీని పరిధిలోని రైల్వే డివిజన్లు, వర్క్‌షాపులలో అప్రెంటీస్ అవకాశం కల్పిస్తారు. పదో తరగతితో పాటు, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసైన అభ్యర్థులు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కాగా, చివరి తేదీ 22-10-2024. వెబ్ సైట్: https://www.rrc-wr.com